[ad_1]
జగనన్న విద్యా దీవెన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బదులు ప్రభుత్వాన్ని నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయాలని హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను జస్టిస్ కొంగర విజయ లక్ష్మి కొట్టివేసింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి గత తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం ప్రారంభించగా, దీన్ని వ్యతిరేకిస్తూ పలు కళాశాల యాజమాన్యాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
[ad_2]
Source link